* హోమ్

అతిథులు

free-website-hit-counters.com

16, అక్టోబర్ 2011, ఆదివారం

మహా విష్ణు స్తోత్రం

సప్తస్వర గుప్తస్తుతి

(మహా విష్ణు స్తోత్రం)
మాపా, నిగమాగమపస
దాపా, నీ పాద దాస దరి, గరిసరి, మా
పాపారి, గరిమ గని, మరి
దాపస పాదపమ, దాస దాసరిని సదా!!


సంక్షిప్త వ్యాఖ్య:

మాపా = లక్ష్మీభర్తవైన ఓ మహా విష్ణూ!, నిగమాగమపస దాపా = వేదాల సారాంశమునిచ్చినట్టి వాడా!, నీ పాద దాస దరి = నీ పాద దాసులైన వారికి (భక్తులకు) దగ్గరైన , గమ్యమైన వాడా!, గరిసరి = ఈశ్వరునకు సమానమైన వాడా! (శివకేశవాభేదం),  మా పాపారి= మా పాపములను నాశము చేయువాడా! గరిమ = గొప్పదనానికి, గని = ఖని వంటివాడా! మరిన్ =  మరి, తాపస పాదపమ = తాపసులకు కల్పవక్షం వంటివాడా!, దాస దాసరిని సదా =  నీ దాసులైన వారికి సదా దాసుడను.!!


------------------------00----------------------------

2 కామెంట్‌లు:

  1. అద్భుతం! నాకిలాంటి చిత్రకవిత్వమంటే ఎంతో ఇష్టం. వ్యాఖ్యానంతో ప్రకటించడం ఆనందాన్ని కలిగించింది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  2. ఆర్యా ! మాబోటి ఔత్సాహికులకు మీ ' చిత్ర సహిత ' చిత్ర కవిత్వం కనుల విందుగా పసందుగా నున్నది. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి