* హోమ్

అతిథులు

free-website-hit-counters.com

14, అక్టోబర్ 2011, శుక్రవారం

ముళ్ళకంపలు

  1. శ్రీ భాగ్య శాలురకు, మి
    థ్యా బాబా, మౌని, యోగి, దైవఙ్ఞులకున్
    ప్రాభవము పంచి పెంచిన
    మా భారత మాత సాటి మహిలో గలదే!
  2.  కందము పద్యములన్నిట
    నందముగా నుండునన్న యార్యోక్తికి, నే
    స్పందించి వ్రాయ బూనితి
    కందములన్ వ్యంగ్య, హాస్య కౌశలమొప్పన్!
  3. బూతుల పలుకగ నొల్లను,
    నీతులు చెప్పేటి విద్య నేర్వను, కానీ
    యాతాయాత సమాజపు
    రీతుల నుడివెదను బుద్ధి రెక్కొను భంగిన్!!
  4. రహదారి విడిచి నడిచిన
    గహనములో గ్రుచ్చు "ముళ్ళ కంపల"టంచున్
    ఇహ మందున జీవించే
    సహవాసుల హెచ్చరింతు సవినయముగనే !!

     

4 కామెంట్‌లు:

  1. శర్మ గారూ ! నమస్కారములు.మీ గేయం, కందం అందముగా వున్నవి. ప్రతిభను చాటుచూ ' సుస్వరాలుగా ' వినిపిస్తూ ' భాస్వరాలుగా ' కనిపిస్తున్నవి. ముళ్ళకంపలు వ్యంగ్య హాస్య రచన లన్నారు.గులకరాళ్ళు దేనికి సంకేతం ?

    రిప్లయితొలగించండి
  2. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ!

    సౌధనిర్మానికి ముఖ్యమైన వస్తువు సున్నం. గదుల్లోకి ధారళంగా వెలుతురు రావడానికి గది గోడలకు సున్నం వెల్ల వెస్తారు. ఆరోగ్య రీత్యా కూడా ఇది శ్రేష్టం. అలాంటి సున్నం తయారీకి మూల పదార్థం గులకరాళ్ళు.

    సామ్యవాద సమసమాజ నిర్మాణానికి అత్యవసర సమాజ పరిణామ క్రమం, గతి తార్కిక భౌతిక వాదం - ఈ రెండింటింని కలిపి తేటగీతి పద్యాల్లో "గులకరాళ్ళు " శీర్షికన అందిస్తున్నాను.

    ధన్యవాదములు..!

    రిప్లయితొలగించండి
  3. నమస్కారములు.
    మీ కంద పద్యములు అందంగా ఆసక్తి కరం గా ఉన్నాయి .ధన్య వాదములు.

    రిప్లయితొలగించండి