(నమనం)
మనమే మనమని మనమన
మనుమని మనుమని మనుమని మననమ్మేనా?
మన మేనమామ మామను
మునునేమిన మౌనిమౌని మోమున మనుమా!
మనమే మనమని మనమన
మనుమని మనుమని మనుమని మననమ్మేనా?
మన మేనమామ మామను
మునునేమిన మౌనిమౌని మోమున మనుమా!
సంక్షిప్త వ్యాఖ్య:
మనమే = మనం అందరమూ, మనమని = శాశ్వతం కాదని, మనమన = బుద్ధీ హెచ్చరిస్తూన్నా, మనుమని మనుమని మనుమని = పౌత్రునకు పౌత్రునకు పౌత్రుని (తన తర్వాత తరాల (7 తరాలు) గురించి) మననమ్మేనా? = తాపత్రయ పడడమేనా? (కాదు), మన మేనమామ = మన మేన మామ అయిన చంద్రుడికి, మామను = మామగారైన దక్షప్రజాప్రతిని, మును+నేమిన = పూర్వం శిక్షించిన, మౌనిమౌని = మునీశ్వరులకి మునీశ్వరుడైన, మునులలో అగ్రగణ్యుడైన శివుని , మోమున = ముఖస్థముగా, మనుమా! = జీవించుట మేలు!!
* అనగా జన్మ పరంపరను కోరడం కంటే జన్మ రాహిత్యమును పొందడానికి మోక్షప్రదాత అయిన శివుని ఆశ్రయించడం మేలు!!
మీ ద్వ్యక్షరి అద్భుతంగా ఉంది.
రిప్లయితొలగించండిఆర్యా ! ' మన ' చిత్ర కవిత్వం గురించి ఏమనను! నా మనమున కాహ్లాదము కలిగించినది.
రిప్లయితొలగించండిశంకర, హనుమచ్ఛాస్త్రులకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిఅద్భుతమైన రచన.ధన్యవాదములు
రిప్లయితొలగించండి